తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో వేగం పెంచింది.రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అద్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయి౦చింది .మొత్తం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 ఫ్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని టీ సర్కార్ నిర్ణయి౦చింది. యూనివర్సిటీల వారీగానే రిజర్వేషన్లను పాటిస్తూ ఈ పోస్టులను భర్తీ చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఖాళీలలో 103 ప్రొఫెసర్లు, 266 అసోసియేట్ ప్రొఫెసర్లు, 692 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లు వారం రోజుల్లో జారీ చేయాలని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు
