Home / ANDHRAPRADESH / ప్ర‌త్యేక హోదా కోసం..!!

ప్ర‌త్యేక హోదా కోసం..!!

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ధ‌ర్నాలు, ర్యాలీలు, దీక్ష‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌ద్ద‌రిల్లుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా ఏపీకి ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అన్న మాట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమ‌ర‌ణ దీక్ష చేయించారు ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ఆరు రోజుల నుంచి చేస్తున్న‌ ఆమ‌ర‌ణ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా మంగ‌ళ‌వారంనాడు ఏపీలోని జాతీయ ర‌హ‌దారుల దిగ్భందనం కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ వైసీపీ ఇవాళ రైల్ రోకో కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. రైల్ రోకోలో భాగంగా.. ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో రైళ్ల‌ను నిలిపివేసిన వైసీపీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ జ‌గ‌న్ తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌తీ నిమిషం ప్ర‌త్యేక హోదాపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మోడీ స‌ర్కార్‌.. తెస్తామ‌ని చంద్ర‌బాబు సర్కార్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రిచిపోయినా.. ఇప్ప‌టికీ ఏపీలో ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయంటే అందుకు కార‌ణం వైఎస్ జ‌గ‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ పోరాటం పై విధంగా ఉండ‌గా.. అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీల పోరాటం మాత్రం మ‌రోలా ఉంది. ఢిల్లీలో ఒక్క‌రోజు ఆమ‌ర‌ణ‌దీక్ష చేసి, ఆ త‌రువాత రోజు మోడీ ఇంటి ముట్ట‌డి చేసి, ఆ వెంట‌నే ఏపీకి తిరుగుప‌య‌న‌మైన విష‌యం తెలిసిందే. మ‌రోప‌క్క చంద్ర‌బాబు కేబినేట్ మంత్రులు మాత్రం రికార్డింగ్ డ్యాన్సులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంతో ప్ర‌జ‌ల ఆవేశం సెగ‌లు క‌క్కుతుంటే.. టీడీపీ మంత్రులు మాత్రం రికార్డింగ్ డ్యాన్స్‌ల‌తో సేద‌తీరుతున్నారు.

ఇలా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే కెమెరాకు చిక్కారు ఏపీ రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు. ఇప్పుడు ఈ వీడియో సోస‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, మంత్రి స్థాయిలో ఉన్న అయ్య‌న్న పాత్రుడి రికార్డింగ్ డ్యాన్స్‌లు చూసిన ప్ర‌జా సంఘాల నేత‌లు పెద‌వి విరుస్తున్నారు. ఓ వైపు ఏపీలో ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మం జ‌రుగుతుంటే.. మంత్రికి ఇదేం పోయే కాల‌మంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అశ్లీల డ్యాన్స్ ప్రోగ్రాంలో మంత్రి అయ్య‌న్న పాత్రుడు పాల్గొని డ్యాన్స్ చేయ‌డాన్ని మ‌హిళా సంఘాలు వ్య‌తిరేకిస్తున్నాయి.

Image result for వైసీపీ ఎంపీల ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌

సో.. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్‌… ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేసే పార్టీ ఏది..??? టీడీపీనా..!! వైసీపీనా..!! న్యాయ నిర్ణీత‌లు మీరే.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ‌జేయండి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat