ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే .తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .ప్రజాసంకల్ప యాత్ర
పేరిట గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు .
See Also:సమయం లేదు మిత్రమా ..జగన్ కు అండగా ఉండాలంటూ రంగంలోకి మాజీమంత్రి ..!
ఈ క్రమంలో ముమ్మడివరం అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మొత్తం మూడు వేల మంది కార్యకర్తలతో ,రెండు వందల మంది భారీ అనుచవర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్భంగా జగన్ వారికీ వైసీపీ కండువా కప్పి పార్టీలో సాధారంగా ఆహ్వానించారు .అనంతరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే సంజీవని ప్రత్యేక హోదాను సాధించే దమ్మున్న నాయకుడు జగన్.
See Also:చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!
ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ..చదువుకున్న యువతకు ఉద్యోగాలతో పాటుగా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు .అయన ఇంకా మాట్లాడుతూ వైసీపీలోకి వలసలు తనతోనే మొదలు ..ఇంకా అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వస్తారంటూ బాంబు పేల్చారు పొన్నాడ …అయితే అప్పట్లో వస్తున్నా వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వైసీపీలో చేరతారు అని దరువు ముందే చెప్పింది ..వివరాలు కోసం కింది లింక్ క్లిక్ చేయండి ..
http://www.dharuvu.com/2018/02/21/ex-mla-join-in-ysrcp-2/
See Also:ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో