ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కించుకొని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే పలు రాష్ట్ర ,జాతీయ సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో ప్రస్తుత అధిక పార్టీ అయిన టీడీపీ నేతలు జగన్ చెంతకు చేరుతున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఏప్రిల్ 14 న వైసీపీలోకి చేరనున్నారు.అయితే గత కొన్ని రోజులుగా రవి వైసీపీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆయన్ను పిలిచి మాట్లాడిన.. ఫలితం లేకుండా పొయింది.ప్రస్తుతం జగన్ ప్రజసంకల్ప యాత్ర గుంటూరులో కొనసాగుతుంది.మరో నలుగు రోజుల్లో ఈ యాత్ర విజయవాడకు చేరుకోనుంది.అదే రోజు రవి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.ఈ క్రమంలో నిన్న సాయంత్రం ప్రజసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని యలమంచిలి రవి కలిశారు.ఈ సందర్భంగా ‘మీరు పార్టీలోకి వస్తారనుకోలేదని, వచ్చినందుకు కృతజ్ఞతలని’ జగన్ అన్నారు. నియోజకవర్గం వైసీపీ సీటుకు ఆశావాహులు చాలా మంది ఉండడంతో, తాను రావడం వల్ల వారికి ఇబ్బంది అవుతుందేమోనని రవి ప్రస్తావించగా..ఇంకా ఎవరికీ కమిట్‌మెంట్ ఇవ్వలేదని జగన్ తెలిపినట్లు సమాచారం.
ఈ విషయాన్నీ దరువు.కామ్ ముందే చెప్పింది. ఆ వివరాల కోసం ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి .