తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావు తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండ రాంకు జై కొట్టారు .ఇటివల ప్రో కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఇటివల ఆ పార్టీ జెండాను ,కండువా స్వరూపాన్ని ప్రకటించారు .
తాజాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకు కోదండ రాం లేఖ రాశారు.అయితే డీజీపీ అనుమతివ్వడం కుదరదు అని తేల్చేశారు .
ఈ క్రమంలో మాజీ ఎంపీ విహెచ్ మాట్లాడుతూ తెలంగాణ జనసమితికి సభకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం .సినిమావాళ్ళకు అనుమతి ఇచ్చిన సర్కారు కోదండ రాంకు ఎందుకివ్వడంలేదు .కోదండ రాంకి తన మద్దతు ఉంటుంది అని ..అనుమతి ఇవ్వకపోతే తెలంగాణ సునామీగా మారుతుంది అని ఆయన సర్కారును హెచ్చరించారు ..