దేశంలో ఎక్కడ చూసిన వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతున్నది.జంట నగరాల్లో మరి దారుణం… పట్టపగలు కూడ సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఎన్నో సార్ల్ పోలీసులకు పట్టుబడిన మళ్లి అదే వ్యబిచారం చేస్తున్నారు. తాజాగా గోవాలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. గోవా రాష్ట్రంలోని కాలాన్‌గుటే బీచ్ కేంద్రంగా ఉన్న గ్రీన్ పీస్ హాలిడే హోమ్ గెస్ట్‌హౌస్‌లో ఓడిశాకు చెందిన ఇద్దరు యువకులు విదేశీ వనితలతో గుట్టుగా వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఐదుగురు వ్యభిచారిణులతోపాటు రూ.1.25లక్షలు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలతో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని మహిళా సదనానికి తరలించారు. విదేశాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి బీచ్ లో ఉన్న గెస్ట్ హౌస్ కేంద్రంగా వ్యభిచారం సాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యభిచార నిర్వాహకులైన చందన్ కుమార్, ధనుంజయ్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.