ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఇవాళ నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావుతో కలిసి రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడారు.
“ రైతుల సంక్షేమమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా .దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు.ఇది గొప్ప విషయం.నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నాకు సంతోషం కలుగుతుంది.సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా మంచి పనులు చేస్తున్నారు.నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆయనకు ఉంటాయి.తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతున్నది.ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నా ” అని అన్నారు..
see also :ఉమ్మడి హైకోర్టు సంచలనాత్మక తీర్పు -ఇబ్బందుల్లో స్పీకర్ ..!
see also :పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కొనసాగించాలి..ఎంపీ కవిత