ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తంబళ్లపల్లి గ్రామంలో జగన్ తన పాదయాత్రను 133వ రోజు కొనసాగించారు.
ప్రజా సంకల్ప యాత్ర తంబళ్లపల్లి గ్రామాన్ని చేరుకోగానే ఆ గ్రామ ప్రజలు వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ మాత్రం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. నేనున్నానంటూ వృద్ధులకు, నిరుద్యోగులకు భరోసానిస్తూ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, జగన్ పాదయాత్రను ఉద్దేశించి మంగళగిరి నియోజకవర్గ మత్స్యకారులు మాట్లాడుతూ.. జగన్ తన పాదయాత్ర ఆద్యంతం ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేయడం అద్భుతమని, చంద్రబాబు మాత్రం తనపై ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకు మోడీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వ వద్ద తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా వదిలేసి.. ప్యాకేజీ వస్తుందంటూ ప్రజలను మోసం చేశారన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో మేమంతా వైఎస్ జగన్ వెంటే ఉంటామని, జగన్ అన్నకే మా ఓటు వేస్తామని స్పష్టం చేశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు.