అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రలు పన్ని ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతున్న సంగతి విదితమే .
See Also:ఏపీ స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
అయితే ఇప్పటివరకు పలు అక్రమ కేసులు బనాయించిన కానీ ఒక్క కేసులో కూడా ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేస్తుంది . తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు సంబంధించిన కేసులో పన్నెండవ నిదితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి ,అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మురళిధర్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది ..ఆయనపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది .
See Also:ఏప్రిల్ 14న వైసీపీలోకి యలమంచిలి రవి..!!
అందులో భాగంగా లేపాక్షి నాలెడ్జి హబ్ కేసులో ఐఏఎస్ మురళీధర్ రెడ్డి తప్పేమీ చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ మోపిన అభియోగాలలో ఒక్కదానికి కూడా సాక్ష్యం చూపించలేక విఫలం అయిందని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.దీనితో కలుపుకొని ఇప్పటివరకూ మొత్తం 9 కేసులలో జగన్మోహనరెడ్డికి క్లీన్ చిట్ వచ్చినట్లయింది.ఇంకా మిగిలిన రెండు కేసులలో కూడా సీబీఐకి ఇదే పరిస్థితి ఎదురుకాబోతుంది. ఏ ఒక్క కేసులో కూడా సరైన సాక్ష్యాలు లేకుండా అక్రమంగా కేసులు పెట్టిన ఫలితంగానే కోర్టుల్లో ఏమీ నిరూపించలేకపోతున్నారు.సో త్వరలో జగన్ క్లీన్ సిట్ తో బయటకు రాబోతున్నాడు .మరి వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ కదా ..