ఏపీలో వైసీపీ నుండి టీడీపీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు ఫిరాయించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
See Also: YSRCP శ్రేణులకు గుడ్ న్యూస్ – జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!
అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు వేయాలని ..వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ ,అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు పలుమార్లు వైసీపీ పార్టీ విన్నవించుకుంది .అయితే స్పీకర్ వారి మాటను ,విజ్ఞప్తులను పెడచెవిన పెట్టాడు .దీంతో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించాడు .
ఆర్కే వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు స్పీకర్ కు నోటీసులు జారీచేసింది.పార్టీ మారి ఇన్నాలైన కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు .చర్యలు తీసుకోవడం మీచేతిలోనే ఉంది కదా .పిటిషనర్ ఎన్ని సార్లు పిర్యాదు చేసిన చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది .అసెంబ్లీ సెక్రటరీ,స్పీకర్ కు నోటీసులన ఇస్తూ తదుపరి విచారణకు మూడు వారాలకు వాయిదా వేసింది ..