కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఏప్రిల్ 14న వైసీపీలోకి యలమంచిలి రవి..!!
అయితే, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. స్పీకర్ కోడెల కుటుంబం అటు నర్సారావుపేట, ఇటు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడటమే ఇందుకు కారణం. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు, కాంట్రాక్టర్లను సైతం వదలకుండా కోడెల ఫ్యామిలీ వారిపై దాడులను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, భూ కబ్జాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నది కోడెల కుటుంబంపై ఉన్న ప్రధాన ఆరోపణ. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కోడెల ఫ్యామిలీ అరాచకాలు తారా స్థాయికి చేరాయన్నది ఆ రెండు నియోజకవర్గాల ప్రజల మాట.
స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ అరాచకాలు అంతటితో ఆగలేదు. తాను చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు అడ్డుపడుతున్న వైసీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి వంటి వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీంతో కోడెల కుటుంబానికి ప్రజలు దూరమవడంతోపాటు.. వైసీపీకి ప్రజలు మరింత దగ్గరవుతున్నారు. స్పీకర్ కోడెల ఫ్యామిలీ అరాచకాలు ఇలాగే కొనసాగితే త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని, అసలే తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించాలని చూస్తున్న కోడెల శివప్రసాద్‌కు భంగపాటు తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.