జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్‌కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్‌కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న మాటలే. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
see also :
నవ్వులే.. నవ్వులు..!!
కాగా, ఇంటర్వ్యూలో భాగంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. జగన్‌మోహన్‌రెడ్డి గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలోని వనరులన్నింటినీ పీక్కుతిన్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడ అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుందోనన్న భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడమే మానేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేవారు ఉండరు కాబట్టే సీఎం చంద్రబాబు ఆదేశానుసారం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయలేదని స్పష్టం చేశారు జలీల్ ఖాన్. వైఎస్ జగన్ తాను చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, అయితే, ప్రత్యేక హోదా ఇవ్వని మోడీపై ఒక్క విమర్శైనా చేయకపోవడం బాధాకరమన్నారు జలీల్ ఖాన్. చంద్రబాబు నాయుడుకు జాతీయ స్థాయిలో పలుకుబడి ఉంది. ప్రత్యేక హోదా సాధన చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది. ఆ క్రమంలోనే జాతీయ పార్టీలన్నింటిని కలుపుకుని మోడీపై యుద్ధం చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు.