ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైందా అనిపిస్తుంది .ఇప్పటికే అధికార టీడీపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి క్యూలు కడుతున్నారు .తాజాగా రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ బడా పారిశ్రామిక వేత్త వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు.
See Also:కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిక..!
అందులో భాగంగా ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎంవీవీ ఆయన్ని కలిశారు.త్వరలోనే వైసీపీ గూటికి చేరతాను అని హామీ ఇచ్చారు .అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇస్తే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గెలుపుకు తనవంతు సహకరిస్తాను అని కూడా హామీ ఇచ్చారు.
See Also:చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గంలోకి హీరో శివాజీ ..!
అయితే జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంట .త్వరలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.అయితే ఇటు ప్రజాక్షేత్రంలో అటు ఆర్థికంగా కూడా బలమైన ఎంవీవీ వైసీపీ పార్టీలో చేరడం ఆ పార్టీకి మంచి ఊపునిచ్చే పరిణామమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..
See Also:ఫిరాయింపులపై ఉమ్మడి హైకోర్టు సంచలనాత్మక తీర్పు -ఇబ్బందుల్లో ఏపీ స్పీకర్ ..!