బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు .దేశ సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసిన సైనిక అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చారు.అందులో భాగంగా భారత్ కే వీర్ అనే పేరుతొ ఒక వెబ్సైట్ ,అప్లికేషనును గత ఏడాది ఏర్పాటు చేశారు.
దీని ద్వారా ఎవరైనా సరే నేరుగా దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు విరాళాలు అందించవచ్చు.అయితే ఇప్పటికే దీని వలన కొన్ని వేల మందిసైనిక కుటుంబాల్లో కొత్త వెలుగులను నింపారు అక్షయ్ .సరిగ్గా ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ,2017న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అక్షయ్ ఏడాది పూర్తైన సందర్భంగా మాట్లాడుతూ “నేటితో భారత్ కే వీర్ ఏర్పాటు అయి ఏడాది అయింది.
కల ఇప్పుడు నిజమైంది .దీని ద్వారా మొత్తం ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను విరాళాలను సేకరించి మొత్తం నూట యాబై తొమ్మిది సైనిక అమరవీరుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశామని ఆయన అన్నారు .మీ ఆదరణ ఎప్పటికి ఇలా ఉండాలనే ఆయన కోరారు .అయితే సైనిక అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండటానికి గత ఏడాది
http://www.bharatkeveer.gov.inను ఏర్పాటు చేశారు ..