సిరియాలో దాడులు ఆగడం లేదు…రెబల్స్ మరియు ప్రభుత్వ దళాల మద్య జరుగుతున్న ఈ దాడుల్లో అమాయక ప్రజలు బలవుతున్నారు.తాజాగా సినియాలోని తూర్పుభాగంలోని గౌటాపై ప్రభుత్వ దళాలు విచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముఖ్యంగా అన్నెంపెన్నెం ఎరుగని చిన్నారులు చనిపోతున్నారు.సుమారు వందకు పైగా చిన్నారు మరణించారు.మరికొంత మంది చిన్నారులు కనిపించడం లేదు.అక్కడున్న ఆసుపత్రులన్ని చిన్నారులతో నిండి పోయాయి .చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యా యి.వైద్యం అందించడానికి వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ప్రభుత్వ దళాలు కెమికల్ దాడులకి దిగటంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.