Home / MOVIES / గర్భవతిగా ఉన్న సమయంలో అనసూయకు అక్రమ సంబంధం అంటగట్టారు

గర్భవతిగా ఉన్న సమయంలో అనసూయకు అక్రమ సంబంధం అంటగట్టారు

తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అలాగే, బుల్లితెరపై తన అందచందాలను ఆరబోస్తూ యువతీయువకుల మనసులను కొల్లగొట్టిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం “రంగస్థలం”లో యాంకర్ అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ను అంత తొందరగా మర్చిపోలేము. అనసూయ ‘రంగస్థలం’ సినిమా విజయోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ మధ్య వీరిద్దరికీ అఫైర్ ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై హాట్ యాంకర్ అనసూయ తాజాగా వివరణ ఇచ్చారు.

తన కెరీర్ ప్రారంభంలో హెచ్ఆర్ ఉద్యోగిగా పని చేశానని… ఆ తర్వాత మీడియాలో ప్రవేశించినట్టు తెలిపారు. టెలివిజన్ షోలలో యాంకర్‌గా పని చేసి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టినట్టు వివరించింది. అయితే, మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేశానని… ఆ సమయంలో ఆయనతో తనకు అపైర్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తాను గర్భవతినని… ఆ వార్తలతో తాను చాలా భయపడిపోయానని చెప్పింది. అయితే, తన భర్త తనకు అండగా నిలబడ్డారని… నేను నమ్మనంత వరకు నీవు భయపడాల్సిన అవసరం లేదని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. తన కుటుంబసభ్యులు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని… అందుకే యాక్టింగ్ కెరీర్‌లో కొనసాగుతున్నానని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat