తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను తన అనుచరులు పట్టుకునేందుకు ప్రయత్నించగా అంతలోనే అయన పారిపోయాడు.కాని ఆ లారీ లో ఉన్న క్లీనర్ దొరికాడు.ఈ సందర్భంగా పోలీసులు అతడ్ని ప్రశ్నిస్తున్నారు.