సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో సంచలనమైన ట్వీట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు శ్రీ రెడ్డిని పోలుస్తూ మహేష్ చేసిన ట్వీట్ కు పవన్ అభిమానులు మండి పడుతున్నారు.గత కొన్ని రోజుల నుండి బావా అంటూ కత్తిని ఒకరు ప్రశ్నించడం.. బామ్మర్ది అంటూ కత్తి మహేష్ సమాధానం ఇస్తున్నట్లుగా కత్తి మహేష్ ఈ మధ్య ట్వీట్స్ చేస్తుండటంవిదితమే . అదే తరహాలో ఇక్కడ బామ్మర్ది అనే అతను “బావా! ప్రాణం పోయినా ఇచ్చినమాట. చెప్పిన మాట నిలబెట్టుకునేవాళ్ళని ఏమంటారు? నిలబెట్టుకోనివాళ్ళని ఏం అంటారు?” అని ప్రశ్నిస్తే.. ‘‘ఒకరిని శ్రీరెడ్డి అంటారు. మరొకరిని పవన్ కల్యాణ్ అంటారు బామ్మర్ది!’’ అంటూ కత్తి సమాధానం ఇచ్చాడు . ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"బావా!ప్రాణం పోయినా ఇచ్చినమాట. చెప్పిన మాట నిలబెట్టుకునేవాళ్ళని ఏమంటారు?నిలబెట్టుకోనివాళ్ళని ఏం అంటారు?"
ఒకరిని శ్రీరెడ్డి అంటారు. మరొకరిని పవన్ కల్యాణ్ అంటారు బామ్మర్ది!
— Kathi Mahesh (@kathimahesh) April 7, 2018