ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారాడు. ఈ నాలుగేళ్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర విభజన చేస్తారోనని ఎదురు చూశానంటూ మీడియా సాక్షిగా పప్పులో కాలేశాడు మంత్రి నారా లోకేస్. కాగా, గత శుక్రవారం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే, నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టు ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న ఆందోళనలు, పోరాటాలు చూసిన ఏపీ అధికార పార్టీ టీడీపీ.. మేము కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామన్న నమ్మకం ప్రజలకు కలిగేలా ఓ గంట సైకిల్ యాత్ర చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంలోనే మంత్రి నారా లోకేష్ ఓ మీడియాకు 30 నిమిషాల నిడివిగల ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, నారా లోకేష్ మాట్లాడినంతసేపూ ఊపిరిబిగబట్టి మరీ నారా లోకేష్ ఇంటర్వ్యూను గమనించడం టీడీపీ నేతల వంతైంది. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు ఏ సమయాన.. ఎటువంటి కళాఖండాన్ని తన నోటి నుంచి వదులుతారోనన్న భయం వారిలో కనిపించింది. అందులోనూ నారా లోకేష్ ఒక పక్క సైకిల్ తొక్కుతూ.. మరో పక్క ఇంటర్వ్యూ ఇవ్వడమంటే పులిపై స్వారీ చేయడమే అంటూ టీడీపీ నేతలే సెటైర్లు వేయడం గమనార్హం.
ఏదేమైనా నారా లోకేష్ మాత్రం తన మాటల చాణుక్యతను మరువలేదు. తనలోని కళాఖండాన్ని మీడియా సాక్షిగా మరోసారి బయటపెట్టారు. ఆ ఖళాఖండాలను ఓసారి పరిశీలిస్తే..
1) ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని ఏ ఒక్క పౌరుడు కూడా కోరుకోలేదు. అయినా, ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారు అంటూ పప్పులో కాలేశారు మంత్రి నారా లోకేష్. ఈ మాటను గమనించిన టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్‌కు సైగలు చేయడంతో.. వెంటనే తేరుకున్న లోకేష్.. మోడీ కాదు మన్మోహన్ సింగ్ అంటూ నాలుక్కరుచుకున్నాడు.
2) నారా లోకేష్ తన కళాఖండాన్ని అంతటితో ఆపక మళ్లీ రిపీట్ చేశారు. రాష్ట్ర విభజన చేస్తారని గత నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూశాం.
అయినా, ఇప్పటికీ ప్రధాని మోడీ రాష్ట్ర విభజన చేయలేదు, అందుకు బాధను వ్యక్తం చేస్తున్నానంటూ లోకేష్ చెప్పడం అక్కడ ఉన్నవారందరినీ కూడా ఆశ్యర్యపరిచింది. నారా లోకేష్ మాటలు విన్న ఐదు నిమిషాలకు తేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. అది రాష్ట్ర విభజన కాదని, ప్రత్యేక హోదా అని గమనించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్లీ ఈ మాటను సవరించడం టీడీపీ కార్యకర్తల వంతైంది.
ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, మంత్రి స్థానంలో ఉన్న నారా లోకేష్ ప్రత్యేక హోదాను.. రాష్ట్ర విభజనలా, మన్మోహన్‌సింగ్ స్థానంలో ప్రధాని మోడీ పేరు పలకడం ఇలా మాటలు తడబడుతూ.. నారా లోకేష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో.. ఆఖరుకు రిపోర్టర్ కూడా కన్ఫూజ్ అయిపోయి వైసీపీ ఎంపీలను.. జనసేన ఎంపీలుగా పోల్చి ప్రశ్నలు అడగడం మొదలెట్టాడు.