Home / SLIDER / కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!

సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ తెలంగాణ ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రి కేసీఆర్ ను , మంత్రి హరీష్ రావు ను ప్రశంసల వర్షంలో ముంచెత్తారు . తమ సంఘానికి చెందిన ఇంజనీర్లను కాళేశ్వరం చూడడానికి అనుమతి ఇవ్వాలని ఆయన మీడియా ముందే మంత్రిని కోరారంటే ఆయన ను కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు .

Image may contain: 1 person, standing and outdoor

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్
స్పందన ఆయన మాటల్లోనే …

“ మేం మొదటగా ఉదయం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాం. ఆ తర్వాత మేడిగడ్డ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాం. అనంతరం అన్నారం బ్యారేజీని వీక్షించాం. ఆ తర్వాత మధ్యాహ్నం .. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ రిజర్వాయర్ వరకు… ప్యాకేజీ 6, ప్యాకేజీ 8 పనులను సమీక్షించాం. పంప్ హౌజ్ లు, సర్జ్ ట్యాంక్ లు మిగతా స్ట్రక్చర్లను క్షుణ్ణంగా పరిశీలించాం. ప్రధానంగా నేను, నా ఇద్దరు సహచరులు దృష్టిపెట్టిందేంటంటే.. ప్రాజెక్టు ప్రస్తుతం ఏ దశలో ఉంది. పనులు? ఎంత మేర పూర్తయ్యాయి? ఇంకా ఎంతమేరకు చేయాల్సిఉంది? ఎలాంటి విధానాలను పాటిస్తున్నారు. ? ఏమైనా సమస్యలు ఉన్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చాలా వేగవంతంగా చేపడుతున్నట్టు మేం గుర్తించాం. కాంక్రీట్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించినట్టైతే.. కాళేశ్వరం లో జరుగుతున్నంత వేగంగా పనులు.. దేశంలోని మరే నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ జరగట్లేదు. భూగర్భ పనులు, సర్జ్ పూల్, టన్నెల్స్ లాంటివి చాలా క్లిష్టమైన పనులు. వాటిని కూడా చాలా అద్భుతంగా, పటిష్ఠంగా, వేగవంతంగా నిర్మిస్తున్నారు. ఇంజనీరింగ్ సవాళ్ల ను అధిగమించి పనులు చేయడం అభినందనీయం. మేడిగడ్డ బరాజ్ లో గేట్లు బిగింపు.. ఇతర ప్రాంతాల్లో హైడ్రో మెకానికల్ పనులను, గేట్ల నిర్మాణం లాంటి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను సమాంతరంగా పూర్తి చేసుకుంటూ పోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అబ్బురపరిచేలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం . ఇందుకు నేను మంత్రి హరీశ్ రావును, ఇంజనీర్ల బృందాన్ని, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను .

ఇంత బృహత్తరమైన విజయాన్ని సాధించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు. ఇక ప్రాజెక్టు నిర్మితమవుతున్న తీరు చూస్తుంటే.. అన్ని రకాల పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుపోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్న ఏజెన్సీలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. పనుల నాణ్యత కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది తెలంగాణ ప్రజల పాలిట.. నిజంగా గొప్ప విజయంగా చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో అధిక మొత్తం ప్రాంతానికి సాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 9.3 లక్షల హెక్టార్లు ఆయకట్టు సాగులోకి వస్తుంది. తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి. మరెన్నో రకాలుగా కూడా ప్రాజెక్టుతో మేలు జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ ప్రాజెక్టును గడువు కంటే ముందుగానే పూర్తి చేయాలని సీఎం కేసీయార్, మంత్రి హరీశ్ రావు పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సమీక్ష, మంత్రి హరీశ్ రావు క్రమం తప్పకుండా పనులను స్వయంగా పరిశీలించడంతో.. ఇది సాధ్యమవుతున్నది. నాకంటే ముందు ఈ ప్రాజెక్టు పనులను సమీక్షించిన నా సహచరులు కూడా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాళేశ్వరం ఒక ఘన విజయమని చెప్పారు. దాంతో నేను స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చూడాలని వచ్చాను. ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యద్భుతంగా జరుగుతున్నయని నేను కూడా అభిప్రాయపడుతున్నాను.

మా విభాగంలో హెడ్ క్వార్టర్, ఫీల్డ్ లో పనిచేసే చాలా మంది ఇంజనీర్లకు.. ఇంతటి పెద్ద నీటి ప్రాజెక్టును, ఇన్ని భారీ నిర్మాణాలు, ఎన్నో ప్రత్యేకతలున్న ప్రాజెక్టులను సందర్శించే అవకాశం లభించదు. అందుకే నేను .. మంత్రి హరీశ్ రావును కోరుతున్నాను.. మా విభాగం నుంచి కొందరు ఇంజనీర్లను పంపిస్తాము. వారు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించి.. అవగాహన పెంచుకునేందుకు అనుమతించండి.

నా అభిప్రాయం ప్రకారం కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. దాన్ని ఎంతో ప్రణాళికా బద్ధంగా , ఎంతో నైపుణ్యంతో, పూర్తి శాస్త్రీయంగా , పద్ధతిగా నిర్మిస్తున్నారు. పనులను నిర్దేశిత గడువు, లక్ష్యం మేరకు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం పూర్తవుతున్న తీరు.. తెలంగాణ సర్కారు సాధించిన ఘనవిజయమనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat