కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయు వేగంతో జరుగుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్,తదితరులు మంత్రి వెంట ఉన్నారు.అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రోజుకు 6000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడకం జరుగుతున్నదని అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా జరగలేదని చెప్పారు. ఇది ఒక రికార్డ్ అని అన్నారు. వచ్చే రెండు మూడు నెలలు కూడా ఇదే విధంగా జెట్ స్పీడ్ తో పనులు జరగాలని అధికారులను ఆయనఆదేశించారు. మహారాస్ట్ర , తెలంగాణ రెండు వైపులా గోదావరి ఒడ్డున పనులు
కూడా పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.కేంద్ర జలసంఘం చైర్మన్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మెడిగడ్డ వద్ద తెలంంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలవనరుల చైర్మన్ మసూద్ హుస్సేన్ సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో చేరుకున్నారు. వారికి హరీష్ రావు ప్రాజెక్ట్ పనులు సాగుతున్న తీరును వివరించారు ప్రాజెక్ట్ సి.ఇ.వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్ రూపకల్పన, పనితీరు, ప్రాజెక్ట్ డిజైన్ ల స్తితి గతులను సి.డబ్ల్యు. సి.బృందానికి
తెలియ జేసారు.ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని పనులు శర వేగంగా జరుపుతున్నారని సి.డబ్ల్యు. సి.చైర్మన్ మసూద్ అన్నారు. ఈ బ్యారేజ్ కింద జరిగే మొత్తం పంప్ హౌస్ లను పరిశీలించినట్టు చెప్పారు.