ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి.. గత నలుగు రోజుల నుండి వైసీపీ దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంపై పోరాటం మరింత ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది.రేపు ( మంగళవారం ) వైసీపీ ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్బంధన జరగనుంది. ఎల్లుండి ఉదయం(బుధవారం) వైసీపీ రైల్ రోకో చేపట్టనుంది. ఎంపీల దీక్ష కొనసాగినంత కాలం నిరసనలు చేయాలని వైసీపీ నిర్ణయించింది.
