ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటపడనున్నారని ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి అన్నారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి మీడియాతో ముచ్చటిస్తూ వైఎస్ జగన్‌పై ఆసక్తికర మాటలు మాట్లాడిన విషయం తెలిసిందే. నాడు సోనియా గాంధీని ఎదిరించినందునే వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టించారని చెప్పిన విషయం విధితమే. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, సీబీఐ, ఈడీ అధికారలు సైతం జగన్‌పై పెట్టిన కుట్రపూరిత కేసుల్లో ఏ ఒక్కటి కూడా నిలబడదని పలు మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు.
see also : మరో వివాదంలో వల్లభనేని వంశీ
ఇదిలా ఉండగా వైఎస్ జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించి ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి మీడియాతో ముచ్చటించారు. ఇటీవల కాలంలో జగన్‌పై ఉన్న కేసులన్నీ వీగిపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన రూ.34.64 కోట్ల ఆస్తులను తాత్కాలిక జప్తు చేయాలంటూ ఈడీ ఉత్తర్వులును అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుబట్టిందని, ఇటువంటి కేసులను ఇంకెప్పుడూ అప్పిలేట్ ట్రిబ్యునల్ కు తేవొద్దని ఈడీకి అప్పిలేట్ ట్రిబ్యునల్ హెచ్చరికలు జారీ చేసిందని ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి చెప్పారు. ఇలా వైఎస్ జగన్‌పై ఉన్న కేసులన్నీ త్వరలో క్లోజ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని, గత పాలకులు జగన్‌పై పెట్టిన కేసులన్నీ కుట్రపూరితమైనవేనని, ఆధారాలు లేకుండా కేసులు పెడితే.. ఆ కేసుల విచారణను కోర్టులు స్వీకరించవని ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి తేల్చి చెప్పారు.