బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. వార్నర్ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అతని మనసంతా ప్రస్తుతం ఐపీఎల్‌పైనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మాజీ సారథి జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. తన ఇన్‌స్టాగ్రాం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న నా స్నేహితులందరికీ గుడ్‌లక్. ఈ ఏడాది ఐపీఎల్‌లో మీరు బాగా రాణిస్తారని నాకు తెలుసు’ అని పేర్కొన్నాడు. గతంలోనూ ఓ సారి సన్‌రైజర్స్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ అభిమానులతో లైవ్ చాట్ చేస్తుండగా వార్నర్ ‘హలో భువి’ అని పలకరించాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో తప్పకుండా ఒకసారి ఇండియాకు వస్తానని చెప్పాడు.
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో స్మిత్, వార్నర్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే వీరు ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరమయ్యారు.