ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం లేని వ్యక్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని, బెంగళూరులో, అలాగే లోటస్‌పాండ్‌లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం లేని నీవు చంద్రబాబు గురించి మాట్లాడుతావా..? అంటూ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
see also :
జగన్ కు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా చెప్పిన విజయమ్మ ..
సీఎం చంద్రబాబు నాలుగో నెల ఏప్రిల్ 20వ తేదీన పుట్టాడుకాబట్టి.. 420 అంటూ జగన్ ఎద్దేవ చేస్తున్నాడని, ఆ లెక్కన వైఎస్ జగన్‌ను 12 కేసుల్లో 420గా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వ నేర పరిశోధన (ఈడీ, ఏసీబీ) సంస్థలు కేసులు నమోదు చేశాయన్నారు. కేవలం 5 మంది ఎంపీల చేత రాజీనామాలు చేయించి జగన్ చంకలు గుద్దుకుంటున్నాడని, నాడు బోఫర్స్ కుంభకోణం సమయంలో 35 మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన ఘనత టీడీపీదేనన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి.