Home / SLIDER / ఇంటింటికీ కంటి పరీక్షలు..సీఎం కేసీఆర్

ఇంటింటికీ కంటి పరీక్షలు..సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరిక్షలు నిర్వహించడానకి వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. పక్కా ప్రణాళిక, ఆచారణయోగ్యమైన వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కంటి పరిక్షలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతీ భవన్ లో ఆదివారం సమీక్ష నిర్వహించారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి   సి. లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు   రాజీవ్ శర్మ, సలహాదారు  జీ.ఆర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి   శాంతకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్   వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ ఓ.ఎస్.డి గంగాధర్, చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్  శ్రీనివాస్, ఎన్ పి.సి.బి డైరెక్టర్  మోతీలాల్ నాయక్, సి.ఐ.వో  గోపీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image may contain: 7 people, people sitting and indoor

‘‘మొదట రాష్ట్రంలో ఎన్ని కంటి పరిక్షా శిబిరాలు నిర్వహించాలో నిర్ధారించాలి. ఒక వైద్య బృందం ఒక రోజులో ఎంత మందికి కంటి పరిక్షలు నిర్వహించగలదో తేల్చాలి. దానికన్న అనుగుణంగా జనాభాకు అనుకూలంగా ప్రతీ గ్రామానికి ఎన్ని వైద్య బృందాలు అవసరమైతాయో లెక్క గట్టి, అన్ని బృందాలను పంపాలి. ఒకే రోజులో గ్రామంలోని అందరికీ కంటి పరిక్షలు నిర్వహించాలి. గ్రామాల వారిగా కంటి పరిక్షలు నిర్వహిస్తూ పోవాలి. వైద్య బృందానికి వారానికి ఐదు రోజుల పాటు మాత్రమే పని కల్పించి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి. వైద్య బృందం గ్రామాల్లో పర్యటించే సందర్భంలో అవసరమయ్యే రవాణా, భోజన, బస ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తరఫునే చేయాలి. కంటి పరిక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలను ముందే సమకూర్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 900 వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కంటి వైద్యులనే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల వైద్యుల సేవలను కూడా ఉపయోగించుకోవాలి. గ్రామాల్లో, హైదరాబాద్ లో, కార్పోరేషన్లలో, మున్సిపాలిటీలలో కంటి పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన వ్యూహాలను రూపొందించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘కంటి పరిక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైన వారికి వెంటనే కల్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయాలి. అవసరమైన మందులు ఉచింతంగా ఇవ్వాలి. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి కంటి వైద్య శాలలకు రిఫర్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాకుండ ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘ గ్రామాల్లో, పట్టాణాల్లో చాలా మంది ప్రజలు కంటి జబ్బులతో బాధపడుతున్నారు. కంటి పరిక్షలు చేయించుకునే వెసులుబాటు లేకపోవడం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో, అవగాహన లేకపోవడం వల్లనో వారు చికిత్సకు దూరంగా ఉంటున్నారు. తమకు కంటి జబ్బు ఉన్నా గుర్తించకుండా నెట్టుక వస్తున్నవారున్నారు. వారందరికీ ముందు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల గురించి వస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రతీ ఒక్కరు వైద్య శిబిరానికి వచ్చి కంటి పరిక్షలు చేయించుకునేలా చైతన్య పరచాలి. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. ఒకసారి కంటి పరిక్షలు నిర్వహించుకున్న తర్వాత వారి కంటి చూపుపై ప్రతీ ఒక్కరికి స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా అవసరమైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటారు. మొదటి సారిగా వారికి పరిక్షలు నిర్వహించడమే ప్రభుత్వానికి ఉన్న ప్రధాన బాధ్యత. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికీ కంటి పరిక్షలు నిర్వహించడం అత్యంత క్లిష్టమైన పనే. అయినప్పటికీ అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో, అంకితభావంతో ఈ యజ్ఞం పూర్తి చేసి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ముందడుగు వేస్తుందనే నమ్మకం నాకున్నది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat