ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏవీ సుబ్బారెడ్డి …మంత్రి అఖిలప్రియతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆనాడు భూమా ఏం చెబితే అదే మాట చెల్లేది ఆళ్లగడ్డ నంద్యాలలో.. ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి ఇరువురి మాట అక్కడ ఫైనల్… ఏ మాట ఉన్నా ఏవీకి చెబితే భూమాకి చెప్పినట్టే అయితే ఏవీ ని రాజకీయంగా కూడా పైకి తీసుకువద్దాం అని భూమా నాగిరెడ్డి అనుకునేవారు… అయితే భూమా నాగిరెడ్డి మరణంలో మంత్రి పదవి పొందిన అఖిల ఏవీ సుబ్బారెడ్డిని ఏకంగా ఓ పంచాయతీ వార్డ్ మెంబర్ ని చూసినట్లు చూస్తున్నారట. దీనికి కారణాలు కూడా కొందరు చర్చించుకుంటున్నారు.. కొన్ని భూమా నాగిరెడ్డి ఆస్తులు అప్పగించడంలో ఏవీకి అఖిలకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. అవి ఎవరు తీర్చలేనివి అంటున్నారు… అందుకే ఇరువురి మధ్య వార్ మరింత పెరిగింది… ఇటు గుంటనక్కలు అనే స్టేజీకి అఖిల తన పై కామెంట్లు చేస్తోంది అని ఆమెపై ఏవీ అలాగే ఏవీ కుమార్తె ఫైర్ అయ్యారు.ఆళ్లగడ్డ నంద్యాలలో క్రమ క్రమంగా ఏవీ తన పట్టు పెంచుకుంటున్నారు…
అయితే ఇప్పుడు నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా పొలిటికల్ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నారు… అంతేకాదు తాను పోటికి సిద్దం అని సీఎం చంద్రబాబుకు తన మనసులో కోరిక తెలియచేసినట్లు సమచారం.. దీంతో నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టం అనేది తెలిసిపోయింది..
కనుక మంత్రి అఖిల అక్కడ రాజకీయంగా ఒంటరి అయ్యారు అనేది తెలుస్తోంది. అదేవిదంగా జిల్లా నాయకులు అనేదాని ప్రకారం జగన్ దగ్గర.. భూమా ఫ్యామిలీ ఉండి ఉంటే, ఆమెకు మంత్రి పదవి లేకపోయినా ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు అని అంటున్నారు. ఇక వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియకు నో టిక్కెట్..తమ్ముడి భూమా బ్రహ్మానందరెడ్డికి నో టిక్కెట్ అని కర్నూల్ జిల్లా రాజకీయంలో హాట్ టాపిక్ గా మారింది