వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!! ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోడీ సర్కార్ విడుదల చేసిన నిధుల్లోనూ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఏకంగా స్వచ్ఛ భారత్ పథకానికి సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.998 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ స్వాహా చేసింది. అయితే, స్వచ్ఛ భారత్ పథకం కింద ఏపీకి ఎన్ని నిధులు మంజూరయ్యాయి..? అందులో చంద్రబాబు సర్కార్ ఎన్ని నిధులను స్వాహా చేసింది..? ఇప్పటి వరకు ఎన్ని మరుగుదొడ్లు నిర్మాణానికి నోచుకున్నాయి…? అన్న వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రంలో, ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణానికి పూనుకుంది. అందులో భాగంగానే ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ పథకం కింద ఏపీలో ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్ల సంఖ్య రూ.33,27,520. అయితే, ఒక్కో మరుగుదొడ్డి విలువ రూ.12వేలు కాగా.. మరుగుదొడ్డి లబ్ధిదారుడి నుంచి సీఎం చంద్రబాబు నియమించిన తన జన్మభూమి కమిటీల ద్వారా రూ.3వేలు వసూలు చేస్తూ మీడియా కంటికి పట్టుపడ్డ విషయం తెలిసిందే. ఈ లెక్కన మరుగుదొడ్లు కట్టకుండానే బిల్లు చేసుకుని, నగదు డ్రా చేసుకున్న మరుగుదొడ్ల సంఖ్య 8,31,880. అంటే 8,31,880 x 12,000 = 998 కోట్లు.
అయితే, ఈ భారీ అవినీతి నివేదికను అసెంబ్లీ విజిలెన్స్ కమిటీనే బహిర్గతం చేయడం విశేషం. ఓ సారి ఆ రిపోర్టు సారాంశాన్ని పరిశీలిస్తే కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అసలు మరుగుదొడ్లు కట్టకుండానే.. నివేదిక ద్వారా కట్టినట్టు చూపి సుమారు 27 మండలాలకు సంబంధించిన రూ.7 కోట్లు నిధులను టీడీపీ నాయకులు స్వాహా చేశారు.