ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ..లోక్ సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చకు రాకుండా సభ్యులు అడ్డుకుంటున్నారు అని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తూ ఇటీవల లోక్ సభను నిరవదికంగా వాయిదా వేశారు.
దీంతో తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి అమర నిరాహార దీక్షకు దిగారు వైసీపీ పార్టీకి చెందిన ఐదురుగు ఎంపీలు .ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఢిల్లీ లో ఒక ప్రముఖ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. దీక్ష చేస్తున్న ఎంపీలను పరామర్శించడానికి ఢిల్లీ వచ్చిన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మార్చాడు.నమ్మకం చాటున వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ చంద్రబాబుది ..నమ్మితే ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ జగన్ ది అని ఆమె జగన్ కు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా గురించి చెప్పారు .ఆమె ఇంకా మాట్లాడుతూ
గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ పోరాడుతుంటే కేసులు పెట్టి వేధించింది చంద్రబాబు సర్కారు. ప్రజలంతా గమనిస్తున్నారు .ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ప్రజలను మభ్యపెడుతూ కాలాన్ని గడుపుతున్నారు . బాబు పాలనలో మహిళలకు రక్షణే లేకుండా పోతుంది .ఇప్పటికైనా బాబు దిగొచ్చి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని ఆమె కోరారు ..