తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగు స్థలాన్ని ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం .అందులో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 27న టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతున్నా సంగతి తెల్సిందే .తాజాగా ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఈ నెల 27న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ ,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు .
ఈ రోజు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న ప్లీనరీ ను కొంపల్లి లో నిర్వహించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది .ప్లీనరీ కి సంబంధించిన కమిటీలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో రెండు రోజుల్లో ప్రకటిస్తారు .ప్రజాప్రతినిధుల సభ ,భారీ బహిరంగ సభ ఉంటాయి .దాదాపు పదిహేను వేల మంది ప్లీనరీ కు హాజరవుతారు అని ఆయన తెలిపారు ..