టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కి మా అసోసియేషన్ బిగ్ షాకిచ్చింది .ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరగని విధంగా తీసుకొని నిర్ణయాన్ని అది తెలుగు ప్రాంతానికి చెందిన నటిపై మా తీసుకుంది .గత కొంతకాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి పలువురు హీరోల ,దర్శకుల పేర్లను బయటపెడుతూ వస్తున్నా సంగతి తెల్సిందే . తాజాగా ఆమె ఫిలిం ఛాంబర్ మీద పలు వివాదాస్పద సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది .
అంతే కాకుండా ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన చేసినందుకు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రిజిస్టరై ఉన్న తొమ్మిది వందల మంది నటులతో ఆమె నటించకూడదు అని తీర్మానం చేశాం .
అందుకు ఆమె ను ఇండస్ట్రీ నుండి వెలివేస్తున్నాం అని ఆయన తెలిపారు ..అయితే శివాజీ రాజా ఇంకా మాట్లాడుతూ శ్రీరెడ్డి దరఖాస్తు చేయకపోయినా ..డబ్బులు చెల్లించకపోయిన కానీ సభ్యత్వాన్ని ఇచ్చాం ..అయితే ఆమె పూర్తి వివరాలు ఇవ్వకపోయినా కానీ ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు ..