తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్ హిట్ అయిందని..ఈ పథకం హిట్ అవడంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణీలు వస్తున్నారని.. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల సింగిల్ యూజ్డ్ డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నేతృత్వంలో, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సారథ్యంలో వైద్యం రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మంచి వైద్య సదుపాయాల కల్పన జరుగుతున్నదన్నారు. భారతదేశంలో మొదటి సారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్డ్ ఫిల్టర్లను వాడుతున్నది మన రాష్ట్రమే అని ..అందులో ఒకటి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని చెప్పారు.
Tags CM KCR Govt Of Telangana harish rao