తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే .అందులో భాగంగా తాజాగా నిన్న శనివారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరతాను అని ఆయన ప్రకటించారు .
