2019 జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని ప్రశ్నించారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక స్పష్టతతో మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని చెప్పారు. ‘హోదా కోసం పోరాటాలు చేస్తామని చెప్పాం. చేశాం. అవిశ్వాసం పెడతామన్నాం. పెట్టాం. 12 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేశాం. తీర్మానంపై చర్చ జరగడానికి ఏఐడీఎంకే సభ్యులు చేస్తున్న రచ్చ అడ్డుతగులుతుంటే కనీసం పొరుగు రాష్ట్రాల వారితో చర్చించి సానుకూల స్పందన కూడా తీసుకురాలేకపోయాడు చంద్రబాబు.చంద్రబాబు ప్యాకేజీ దండుకుని మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా భజన పేరుతో పార్లమెంటులో భజన చేస్తున్నారని ఆరోపించారు.