తెలుగు మీడియా అనే బదులు తెగులు మీడియా అంటే బాగుంటదేమో ..మీడియా అంటే ఉన్నది ఉన్నట్లు ..నిజాలు బయటకు తీసుకురావాలి ..సమస్యలు ఉంటె వాటిని వెలుగులోకి తీసుకురావాలి.వాటి పరిష్కారం కోసం తమ వంతు పాత్ర పోషించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరపున పోరాడటానికి ..సమస్యలను తీర్చడానికి తామున్నమనే భరోసా ఇవ్వాలి.ఒక్క ముక్కలో చెప్పాలంటే సామాన్యుడి గొంతు నోక్కబడుతున్నప్పుడు ఆ సామాన్యుడి గొంతుకై స్వరాన్ని వినిపించాలి .శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒక్కొక్కరి బండారాలను బయటపెడుతూ వస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై అవమానాలపై నిరసనగా …ఇండస్ట్రీలో తెలుగు వారికే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్లో మా కార్యాలయం ఎదుట శ్రీరెడ్డి తన దుస్తులను విప్పి మరి అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించింది.అయితే ఆమె మొదట ఒక మహిళా .మహిళా అని చూడకుండా అక్కడ ఉన్న మీడియా మీరు ఇలా ఎందుకు చేస్తారు ..మీరు ఆధారాలన్నీ మీడియా సాక్షిగా బయటపెట్టండి మీకు మీలాంటి వాళ్ళకు న్యాయం జరిగే దాక మీ తరపున మీతో కల్సి పోరాడతాం అని భరోసా ఇవ్వాల్సింది.
అలా కాకుండా ఆమె డ్రస్ విప్పుకునే దగ్గర నుండి రాయలేని విధంగా ఉన్న స్థితిలో శ్రీ రెడ్డిను మీడియా వాళ్ళు లైవ్ లో కనీసం బట్టలు వేస్కోండి అని చెప్పకుండా ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించారు.తము ఒక మహిళతో అది ఆర్దనగ్నంగా ఉన్నసమయంలో మహిళా రిపోర్టర్లు సైతం రేటింగ్ కోసం తాము కూడా మహిళలు అనే విషయం మరిచిపోయి ప్రశ్నల వర్షం కురిపించి మేము రేటింగ్ కోసం ఎంతగైన దిగ జారతామనే సంకేతాలు ఇస్తూ ఇది తెలుగు మీడియా కాదు తెగులు మీడియా అంటూ ప్రపంచానికి చాటి చెప్పింది .