తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో కాంగ్రెస్ ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరారు.
అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో దేవరకద్ర నియోజక వర్గ టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఉప్పల్ లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.అందులో భాగంగా మొత్తం మూడు వందలమంది సర్పంచులు ,ఎంపీటీసీలు ,ఇతర నేతలు గులాబీ గూటికి చేరారు …