తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.13.64కోట్లతో నిర్మించిన 176 డబుల్ బెడ్ రూ౦ ఇండ్లను ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు.ఒక్కో డబల్ బెడ్రూంపై రూ.8లక్షల 75వేలు ఖర్చు చేస్తున్నామన్నారు.ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ మార్కెట్లో రూ.30లక్షలకు పైగా ఉంటుంది…ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 11ఇందిరమ్మ ఇండ్లకు సమానమన్నారు.పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నిర్మించి ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
గతంలో తూతూ మంత్రంగా కొన్ని ఇండ్లను కట్టి..కట్టని ఇండ్లకు కూడా బిల్లులు తీసుకున్నారని చెప్పారు.వందకు వంద శాతం ప్రభుత్వ ఖర్చుతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోని పేదవారికి ఇల్లును కట్టిస్తూ.. ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్షా 116అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఅరె అన్నారు.ఏడాదిలోపు హైదరాబాద్ మహానగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50శాతం ప్రసవాలు పెరిగాయన్నారు.కోటి ఎకరాల మాగానమే లక్ష్య౦ గా ముందుకు వెళ్ళుతున్నామన్నారు.ఐటీలో జాతీయ సగటు కంటే ముందున్నమన్నారు..ఉప్పల్ నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.234కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినమన్నారు.సమైక్య పాలనలో పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు..కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 గంటల కరెంట్ తో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్నదని అన్నారు.ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్ .
ఒక ఆలోచనతో ప్రణాళికమైన అభివృద్ధి తో ముందుకు సాగుతున్నామని..రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ,ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు.ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తున్నా..ప్రతిపక్షాలు మాత్రం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని .పాలమూరును బాగు చేస్తుంటే..కొందరు కుట్రలతో కేసులు వేస్తున్నారని.. అలాంటి వాళ్ళని ప్రజలే నిలదీయాలని మంత్రి కేటీఆర్ చెప్పారు.రానున్న ఎనికల్లో ప్రజలు అలోచించి ఓటు వెయ్యాలని అక్కడున్న ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు.