తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రంపచవ్యాప్త గుర్తింపు దక్కింది. ఇప్పటికే పలు దేశ విదేశాల నుంచి ప్రతిష్టాత్మక సమావేశాలు అహ్వానాలు అందుకుంటున్న మంత్రి కే తారకరామారావుకు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి పిలుపు దక్కింది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిగే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నెషనల్ ఏకానామిక్ ఫోరమ్ సమావేశానికి హజరుకావాల్సిందిగా కోరారు.
ఈ ఏడాది మే నెల 24, నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వాణిజ్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గోని, రష్యాతోపాటు, అంతర్జాతీయ అర్ధిక వ్యవస్ధ గురించి చర్చిస్తారని మంత్రికి పంపిన సమావేశంలో నిర్వహాకులు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గోని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వాణిజ్య ప్రధాన్యతలు, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వపాలసీలపైన ఈ సమావేశానికి హజరయ్యే ప్రతినిధులకు వివరించాలని కోరారు. ఈ సమావేశానికి అహ్వానం దక్కడం పట్ల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.