ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడిలిస్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడటం మాని ..పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోట్ల మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని, చంద్రబాబు ప్యాకేజీ దండుకుని మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా భజన పేరుతో పార్లమెంటులో భజన చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ప్రాంతీయ పార్టీలతో రాదని కేవలం జాతీయ పార్టీతోనే అది సాధ్యమని అన్నారు.
