చాలా మంది భారతీయులకు రాగి కంకణాలు ధరించే అలవాటు ఉంటుంది .రాగి ఆభరణాలు ధరించడం వలన శరీరం పై మంచి ఆరోగ్య ప్రభావం ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు.శరీరంలో రోగనిరోధకతను పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు రాగి కంకణాలు ధరించడం వలన కలుగుతాయి.రాగి కంకణాలు ధరించడం వలన పట్టేసినట్లు ఉండే కిళ్ళ కండరాలకు ఉపశమనం కలుగుతుంది.ఆస్టియో అర్థరై టిస్ ,రుమటాయిడ్ అర్ధారైటిస్ వంటి కిళ్ళ నొప్పులతో బాధపడేవారికి రాగి కంకణాలు ధరించడం వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
కొన్ని పరిశోధనల్లో వెల్లడైన విషయం ఏమిటంటే రాగి కంకణాలు ధరించడం వలన ,శరీరంలో ఏర్పడే కొన్ని రకాల వాపులు మరియు నొప్పులు తగ్గుతాయని నిరుపించబడింది.రాగి శరీరంలో రక్త ప్రసరణ ను కూడా మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా సుక్ష్మ లవణాలైన జింక్ ,ఐరన్ వంటి ఖనిజాలు రాగితో కలిసి ఉండి ,చెమట వలన శరీరంలోకి పిల్చుకోబడతాయి .ఖనిజాల లోపంతో బాధపడేవారికి ఇది ఒక్క చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు.మనలో చాలా మంది ఖనిజాల లోపం వలన సప్లిమెంట్లను మందుల రూపంలో తీసుకుంటారు.అలాంటి రాగి కంకణాలు ధరించడం వలన ఎంతో మేలు జరుగుతుంది.కిళ్ళ నొప్పులు మరియు కణజాలకు దీర్గ కాలంలో ఇది ఎంతో మంచిది.
శరీరంలో కాపర్ లోపం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తు తా యి.ఈ సమస్య వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి ,గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల రాగి క౦కణం వేసుకోవడం వలన మీ హృదయానికి కూడా మంచిది.అంతేకాకుండా ఇది ఇతర లోహాల విషప్రభావం తగ్గించడమే కాకుండా ,హిమోగ్లోబిన్ ఉత్పత్తి ని పెంచే ఎంజైములను ప్రేరేపిస్తుంది.రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముసలితనపు లక్షణాలను దరిచేరనివ్వదు.రాగి కంకణధారణ వలన శరీరంలోని వ్యర్ధాలను బయటకు విసర్జించడంలో సహాయపడుతుంది.