ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు. ఇందులో బాగంగా ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు భారీగా స్వచ్చందంగా వచ్చి ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నారు.
మద్దతు తెలిపిన డోన్ ఎమ్మల్యే..బుగ్గన యువసేన
ఇదిలా ఉండగా.. ఆమరణ దీక్షకు దిగిన వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్డ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆద్వర్యంలో డోన్ పాత బస్టాండ్ సమీపంలో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ చేస్తున్న పోరాటం మరింత ఉధృతం చేస్తున్నారు.హోదా సాధనే లక్ష్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన వైసీపీ ఎంపీలకు ప్రజలు బాసటగా నిలిచారు. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన ఎంపీలకు సంఘీభావం తెలిపారు. మీ వెంట మేమున్నామంటూ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థులు యువకులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలే నిరహార దీక్షలో పాల్లొన్న వారిలో ప్యాపిలి మండల నాయకులు,బి రాంముర్తి,సోమశేఖర్,దివాకర్ రెడ్డి, రంగస్వామి, శ్రీనివాసులు రెడ్డి.డోన్ మండల వైసీపీ నేతలు యు.మద్దిలేటి, యు.ఘని, యు.బాలమద్దయ్య, రామాంజినేయులు,అశోక్ .బేతంచర్ల మండల వైసీపీ నేతలు మల్లికార్జున, రామానాయుడు,రవి ,శ్రీను, మనోహర్ తదితరలు ఉన్నారు.