గోల్డ్‌కోస్ట్ లో జరుగుతన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మూడోరోజు జరిగిన 77 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో సతీశ్‌కుమార్ శివలింగానికి స్వర్ణం లభించింది. దీంతో ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 1 కాంస్యం, 1 రజతం నమోదయ్యాయి.
ఈ పోటీల్లో వెయిట్ లిఫ్టర్లు దీపక్ లాటెర్ ( కాంస్యం), గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం) పతకాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టర్లు పతకాలు సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణం సాధించిన సతీశ్‌కుమార్‌కు ట్విటర్లో రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.