తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ స్పీచ్ కు అభిమానులందరు ఫిదా అయ్యారు.భరత్ బహిరంగ సభలో మొదటగా నందమూరి తారకరామారావు మనవడ్ని అయిన తను అభిమానులందరికి నమస్కారాలు అని ఎన్టీఆర్ అనగానే చప్పట్లు ,కేరింతలతో సభ మొత్తం మారుమోగింది.‘‘ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. మా ఇద్దర్ని మీరందరూ చూడటం కొత్తగా ఉందేమో గానీ, నాకు మహేశ్‌ని చూడటం పెద్ద కొత్తగా లేదు. మీరందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు.. సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ని మహేశ్ అన్న అంటాను. మహేశ్ అన్న ఆడియో ఫంక్షన్‌కి ముఖ్యఅతిథిగా నేను రాలేదు. ఓ కుటుంబ సభ్యుడిగా వచ్చానని…ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
