బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష పార్టీలనులను ప్రమాదకర జంతువులతో పోల్చి తీవ్రంగా అవమానపరిచారు.సాధారణంగా ఎక్కడైనా అధికంగా వరదలు వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పాములు,కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయని ..వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుందని చెప్పారు.అయితే బీజేపీకి మాత్రం బలం వరదలా పెరుగుతోందని పరోక్షంగా చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షా పార్టీలన్నీ ఏకం కావాలని బయట ప్రచారం జరుగుతోందని అమిత్షా విమర్శించారు.