ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేశారు. ఈక్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమరణ దీక్షలో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డిలు దీక్షలో పాల్గొన్నారు. ఎంపీలకు పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఆమరణ నిరాహార దీక్షల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజీపడ్డారన్నారు. వైయస్ జగన్ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. హోదా సాధనకు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహించారని, గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలిపారు.
