గత కొంతసేపటి క్రితం వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు వైఎస్ జగన్ సవాల్ విసురుతూ.. ఏడు సూటి ప్రశ్నలు సంధించారు . ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబు ఉందా? అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.
జగన్ విసిరిన ఆ ఏడు ప్రశ్నలివే..
- ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిందేమిటి?
- ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని కేంద్రాన్ని, అరుణ్‌జైట్లీని చంద్రబాబు ప్రశంసించలేదా?
- అఖిలపక్షం పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించలేదా?
- 2014 డిసెంబర్ వరకు అమలులో ఉన్న ప్రణాళికాసంఘానికి చంద్రబాబు లేఖ ఎందుకు రాయలేదు?
- వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి దీక్షకు దిగితే టీడీపీ ఎంపీలతో నిరసనలు చేయడం మోసం కాదా?
- ప్రత్యేకహోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయని చంద్రబాబు అనలేదా?
- వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే చంద్రబాబు అవిశ్వాసం పెట్టేవారా?.