ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలసి నడవాలనే ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
‘మేం చెప్పిందే చేశాం. మా ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. చంద్రబాబుకు నేను సవాల్ విసురుతున్నా. మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించండి. ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం అందరం ఐక్యమత్యంగా నిలబడదామ’ని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంపీల ఆమరణ దీక్షకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తామని, హోదా పోరాటంలో ప్రజలకు సంఘీభావంగా వైసీపీ నిలబడుతుందని మరో ట్వీట్‌లో జగన్ తెలిపారు.
ఈరోజు రాత్రి వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
గుంటూరు జిల్లా వడ్లమూడి సమీపంలోని సంగంజాగర్లమూడి వద్ద పాదయాత్ర శిబిరంలో ఈరోజు రాత్రి 7 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా పోరాటం, పార్లమెంట్ నిరవధిక వాయిదా, వైసీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు
We do as we say! YSRCP MPs are submitting their resignations today. I challenge @ncbn to make TDP MPs resign and stand united with the people of AP in their rightful demand of special category status for Andhra Pradesh.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2018
YSRCP MPs will go on an indefinite hunger strike at AP Bhawan, Delhi while we will observe relay hunger strikes across the state. We continue to stand in solidarity with the people of AP in their fight for Special Category Status!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2018