తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది.ఇవాళ ఉదయం వ్యవసాయ కులీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడటంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు.అయితే ఆ ట్రాక్టర్ లో ౩౦ మంది ఉన్నట్లు సమాచారం.ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి ఘటనాస్థలానికి బయలుదేరారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి అదేశాలు జారీ చేశారు.