ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెప్పారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతన్నాయి. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, సీనియర్ నేత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరనున్నారు. వచ్చే వారం జిల్లాలో జరగనున్న ప్రజా సంకల్పయాత్రలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని సమాచారం. 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారు. గుంటూరు-2 స్థానం నుంచి కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దించాలని టీడీపీ యోచించింది.
రాజకీయ సమీకరణాలతో చివరి నిమిషంలో టికెట్ లభించలేదు. ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ‘తంగిరాల’ గెలుపునకు కృషి చేశారు. తంగిరాల ప్రభాకరరావు మరణించిన తర్వాత ఉప ఎన్నికల నుంచి ఆయన్ను దూరంగా ఉంచారు. పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యమివ్వలేదు. తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయిన టీడీపీలో ఆయనకు సఖ్యత లేదని వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారరీత్యా వైఎస్ కుటుంబంతో కృష్ణప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనకు టికెట్‌కు ఖరారైందన్నట్టుగా అనుచరులు చెపుతు న్నారు. మైలవరం నుంచి శాసన సభకు లేకపోతే విజయవాడ నుంచి పార్ల మెంట్‌కు పోటీ చేస్తారంటున్నారు.