ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన వాఖ్యలు చేశారు.పవన్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర విషయంలో ఏ తప్పు అయితే చేశారో..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాధాని అమరావతి విషయంలో కూడా బాబు అదే తప్పు చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కేవలం సైబరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని తెలిపారు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా..అంతే విధ్వంసం కూడా జరిగిందన్నారు.చిన్న చిన్న రైతుల నుండి తక్కువ ధరలకు కొన్న కొందరు బడా బాబులు కొన్ని కోట్లకు పడగలెత్తారని అన్నారు.ఈ క్రమంలో అభివృద్దిలో తమకు భాగం లేకుండా పాయిందన్న ఒక భావన ప్రజల్లో చేరిందని..అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని.. ప్రస్తుతం అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
